Dhanush: విడాకులు మంజూరు చేసిన కోర్ట్..! 24 d ago
తమిళ హీరో ధనుష్, ఐశ్వర్యలకు చెన్నైలోని కుటుంబ సంక్షేమ కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. 2004 లో వీరిద్దరికి వివాహం కాగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2022లో వీరు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇరువురి వైపు నుండి సర్ది చెప్పిన వీరి వైఖరిలో మార్పు రాకపోవడంతో నవంబర్ 21న ఫ్యామిలీ కోర్ట్ కు హాజరయ్యారు. వీరిద్దరూ విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు విచారణలో తేలగా తీర్పును 27కి వాయిదా వేయగా విడాకులు మంజూరు చేసినట్లు కోర్ట్ తీర్పు ఇచ్చింది.